జనగామ కలెక్టరేట్‌ను పరిశీలించిన మంత్రులు

22
dayakarrao

ఈ నెల 20న సీఎం కేసీఆర్ జనగామ జిల్లాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనగామ నూతన కలెక్టరేట్‌ కార్యాలయాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ శుక్రవారం పరిశీలించారు. ఒకప్పుడు జనగామ అంటే ఎడారి ప్రాంతం. కనీసం తాగడానికి నీళ్లు దొరికేవి కాదన్నారు. కానీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఈరోజు రెండు పంటలకు సమృద్ధిగా నీరు లభిస్తుందన్నారు.

సమీకృత కలెక్టర్ కార్యాలయం వల్ల అధికారులు అంతా ఒకేచోట ఉండి ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం సులువు అవుతుందన్నారు. కలెక్టర్ కార్యాలయం ప్రారంభం తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభం చేస్తారని ఆనంతరం బహిరంగ సభ ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, బండ ప్రకాష్, ఎమ్మేల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్, మాజీ ఎమ్మెల్సీ బోడేకుంటి వెంకటేశ్వర్లు, చైర్మన్లు పాగాల సంపత్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, మర్రి యాదవ రెడ్డి, నాగుర్ల వెంకన్న, మార్నేని రవీందర్ రావు, గాంధీ నాయక్, ఎడవెల్లి కృష్ణా రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.