కోవిడ్ నిబంధనల ప్రకారమే మండలి సమావేశాలు: గుత్తా

100
gutha

సెప్టెంబర్ 7 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్గొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి…కోవిడ్ నిబంధనల ప్రకారమే సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.

సమావేశాల నిర్వహణపై ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని …. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మాస్కులు లేకుండా వచ్చే వారిని గుర్తించేలా ఆటోమేటిక్ మిషన్‌లు ఏర్పాటుచేశామని తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో మన అసెంబ్లీ 294 మంది సభ్యుల కోసం రూపొందించిన మందిరం కాబట్టి ఇప్పుడు ఉన్న 120 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలకు ఇబ్బంది ఉండబోదని పేర్కొన్నారు.