నిఖిల్‌తో ప్రియాంక అరుల్ @ 18 పేజెస్

307
nikhil

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా కుమారి 21 ఎఫ్ ఫేం పల్నాటి ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, సుకుమార్ కలసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా ప్రియాంక అరుల్ మోహన్ ను తీసుకున్నట్టు సమాచారం. గతంలో నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో ప్రియాంక నటించింది.

ఈ సినిమాతో పాటు కార్తీకేయ 2 సినిమా చేస్తున్నారు నిఖిల్. ఈ రెండు సినిమాలు లైన్‌లో ఉండగానే తన 20వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.ఈ సినిమాని శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ (ఏషియ‌న్ గ్రూప్ యూనిట్‌) బ్యాన‌ర్‌పై నారాయణ్‌దాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు సంయుక్తంగా నిర్మించ‌నుండ‌గా, సోనాలీ నారంగ్ స‌మ‌ర్పించ‌నున్నారు.