రాశివనం లో గ్రీన్ ఛాలెంజ్…

332
gren challenge
- Advertisement -

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా అసిస్టెంట్ కమిషనర్ (జిఎస్టీ) టి.రాజేంద్ర కుమార్ ఈరోజు రాశివనం లో అరుదైన మొక్కలు నాటారు.ఐ.ఎఫ్.ఎస్.అధికారి డా.బి.ప్రభాకర్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించి అవుశ మొక్క (సెస్బానియా గ్రాండిఫ్లోరా), ఇరికికాయ (కార్డియా డిచొటమా) మొక్కలు తెచ్చి రాశివనం లోని పండ్లతోటలో నాటారు.

ఈ మొక్కలు ఔషధ గుణాలతో పాటు, అనేక విశిష్టతలు కలిగి ఉంటాయి.ఈ సందర్భంగా రాజేందర్ కుమార్ మాట్లాడుతూ ‘ఎం.పి.సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ స్పూర్తితో ఈ మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. అలాగే చెట్లను కాపాడితేనే అవి మనల్ని కాపాడుతాయి. అందరూ మొక్కలు నాటి సంరక్షణ చేస్తే ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుతుంది అన్నారు.

గ్రీన్ ఛాలెంజ్ కొనసాగింపుగా టి.ఆర్.ఎస్.రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు, పర్యావరణ వేత్త ప్రభాకర్, పి.ఆర్.టి.యు. నేత, హెడ్ మాస్టర్ నిట్టూరి ఆనందరావు గార్లకు మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసురుతున్నట్లు రాజేందర్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో రాశివనం కన్వీనర్ డా.వి.శంకర్, రాశివనం కమిటీ సభ్యులు డా.పి.రాజగంభీర్ రావు,అభినవ్ నారాయణ్, మురళి పాల్గొన్నారు.

- Advertisement -