కేసీఆర్ కి పరామర్శల వెల్లువ

49
- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  కి పరామర్శలు కొనసాగుతున్నాయి. మంగళవారం నాడు మేఘాలయ ముఖ్యమంత్రి కోన్రాడ్ సంగ్మా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫోన్ చేసి కేసీఆర్ గారి ఆరోగ్యపరిస్థితి అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అదే సమయంలో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మరోసారి కేటీఆర్ కు ఫోన్ చేసి కేసీఆర్ యోగక్షేమాలు అడిగితెలుసుకున్నారు.

కాగా..రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బుధవారం స్వయంగా వచ్చి కేసీఆర్ ను పరామర్శించనున్నారు. వారు ఇప్పటికే కేటీఆర్ కు ఫోన్ చేసి ఆరోగ్యస్థితి ఆరా తీసి పరామర్శించిన సంగతి తెలిసిందే.

Also Read:పిక్ టాక్ :స్టన్నింగ్‌ లుక్‌ తో  మైండ్‌ బ్లాక్‌!

- Advertisement -