సెప్టెంబర్ 10న గోపిచంద్ ‘సీటీమార్’..

205
Seetimaar

సంపత్ నంది దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం సీటిమార్. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా పలుమార్లు రిలీజ్ డేట్ వాయిదా పడగా.. ఇటీవల సెప్టెంబర్ 3న సినిమాను రిలీజ్ చేయనున్నామని మేకర్స్‌ ప్రకటించారు. కానీ ఆ తరువాత దర్శక నిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ఖరారు చేస్తామని అన్నారు.

ఈ మేరకు తాజాగా ఈరోజు కొత్త రిలీజ్ డేట్‌ను కొంతసేపటి క్రితం ప్రకటించారు. ‘వినాయకచవితి’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాను సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. కబడ్డీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో గోపీచంద్‌తో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా జ్వాలారెడ్డి అనే స్పోర్ట్స్ ఉమెన్ పాత్ర చేస్తోంది. భూమిక హీరో సిస్టర్ గా నటిస్తోంది. మరో యువ కథానాయిక దిగంగనా సూర్యవంశీ సైతం కీలక పాత్ర పోషిస్తోంది.

ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు జ్వాలా రెడ్డి , పెప్సీ ఆంటీ సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రం గోపీచంద్, తమన్నా ఇద్దరూ కబడ్డీ కోచ్ లుగా కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో గౌతమ్ నంద తర్వాత వస్తున్న రెండో సినిమా ఇది. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.