విజయ్-శ్రుతి ‘లాభం’ విడుదలకు ముహుర్తం ఖరారు..

128
- Advertisement -

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, అందాల భామ శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం ‘లాభం’. ఎస్.పి. జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లాయర్ శ్రీరామ్ సమర్పణలో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ చిత్రం ఏక కాలంలో మొదటిసారి రెండు భాషల్లోనూ విడుదల అవుతోంది. ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సందర్భంగా నిర్మాత బత్తుల సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా నటించిన ‘లాభం’ చిత్రం సెప్టెంబర్ 9న తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదల అవుతోంది. ఇలా రెండు భాషల్లో మొదటిసారి విజయ్ సేతుపతి చిత్రం విడుదలకావడం విశేషం. మాస్టర్, ఉప్పెన తరువాత విజయ్ సేతుపతి నటించిన పక్కా కమర్షియల్ చిత్రం ఇది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. విజయ్ సేతుపతి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది. పండుగ పూట ఫ్యామిలీతో హాయిగా ఈ చిత్రాన్ని చూడవచ్చు’’ అని అన్నారు.

- Advertisement -