మూడోరోజు పెరిగిన బంగారం ధరలు..

106
silver rate today

బంగారం ధరలు వరుసగా మూడోరోజు పెరిగాయి. హైదరాబాద్‌ నగరంలో 22 గ్రాముల బంగారం ధర రూ.46,400 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 50 వేల మార్క్ దాటి రూ.50,600గా ఉంది.

వెండి ధర సైతం మరింతగా పెరిగింది. దేశంలో కిలో వెండి ధర నిన్న రూ.64,415 ఉండగా.. రూ. 1450 పెరిగి రూ.65,600కు పెరిగింది. భాగ్యనగరంలో వెండి ధర రూ.70,600కి చేరింది. ఈ రెండు రోజుల్లోనే వెండి ధర రూ.2850 పెరగడం గమనార్హం.