దేశంలో 24 గంటల్లో 22,889 కరోనా కేసులు…

97
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటికి చేరువయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 22,889 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 338 మంది మృతిచెందారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 99,74,447కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 3,13,831 యాక్టివ్ కేసులుండగా 95,20,827 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1,44,789 మంది బాధితులు మృతిచెందారు.

దేశంలో రికవరీ రేటు 95.31 శాతంగా ఉండగా మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా నిన్నటివరకు 15,89,18,646 మంది కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) వెల్లడించింది.