రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.94 శాతం

32
ts corona

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 80 వేలు దాటాయి. గత 24 గంటల్లో 551 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 2,80,195కు చేరాయి.

ప్రస్తుతం 7,040 యాక్టివ్ కేసులుండగా 2,71,649 మంది రికవరీ అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 1506 మంది మృతిచెందారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.53 శాతంగా ఉండగా దేశంలో 1.5 శాతంగా ఉంది.

రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.94 శాతంగా ఉండగా దేశంలో 95.4 శాతంగా ఉంది. ఇప్పటివరకు 63,54,388 కరోనా టెస్టులు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.