గ‌న్ పార్క్ వ‌ద్ద ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్

160
Dana Kishore

జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్. జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గ‌న్ పార్క్ వ‌ద్ద చేప‌ట్టాల్సిన ఏర్పాట్ల‌ను జోన‌ల్ క‌మిష‌న‌ర్ ముషార‌ఫ్ అలీ, అర్బ‌న్ బ‌యోడైవ‌ర్సిటీ, ఇంజ‌నీరింగ్ అధికారుల‌తో క‌లిసి స‌మీక్షించారు. గ‌న్‌పార్క్ ప‌రిస‌ర ప్రాంతాల్లో రోడ్ల‌పై ఏవిధ‌మైన గుంత‌లు లేకుండా చేయ‌డంతో పాటు పార్కును ప‌లు ర‌కాల మొక్క‌ల‌తో అందంగా అలంకరించాల‌ని పేర్కొన్నారు.

గ‌న్‌పార్క్ ప‌రిస‌ర ప్రాంతాల‌న్నింటిని ప్ర‌త్యేక సిబ్బందితో ప‌రిశుభ్రంగా ఉంచ‌డంతో పాటు ఆక‌ర్ష‌నీయంగా రూపొందించాల‌ని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రితో పాటు ప‌లువురు మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు, ఉన్న‌తాధికారులు నివాళుల‌ర్పించే అమ‌ర‌వీరుల స్థూపాన్ని ప‌లు ర‌కాల పుష్పాల‌తో ప్ర‌త్యేకంగా అలంక‌రించాల‌ని ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో అర్బ‌న్ బ‌యోడైవ‌ర్సిటీ డిప్యూటి డైరెక్ట‌ర్ నాగిరెడ్డి, ఇఇ సురేష్‌, డిప్యూటి క‌మిష‌న‌ర్ రీచ గుప్తా త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.