రేపు సిరిసిల్లలో పర్యటించనున్న కేటీఆర్..

203
KTR

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు సిరిసిల్లలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 2గంటలకు గంభీరావుపేట మండలకేంద్రంలో ఎల్లమ్మ సిద్ధోగానికి హాజరుకానున్నారు.

సాయంత్రం 4.30గంటలకు సిరిసిల్ల పట్టణంలో రంజాన్ వేడుకల్లో పాల్గోననున్నారు. అనంతరం పేద ముస్లింలకు ఉచితంగా బట్టలు పంపిణి చేయనున్నారు. ఆ తర్వాత సాయంత్ర 6.30గంటలకు ఇఫ్తార్ విందులో పాల్గోననున్నారు. విందు ముగిసిన తర్వాత హైదరాబాద్ కు పయనమవ్వనున్నారు.