సోషల్ మీడియాలో నాపై వస్తున్న వార్తలు అవాస్తవంః పైళ్ల శేఖర్ రెడ్డి

208
Pailla-Shekar-Reddy

భువనగిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధికి వ్యతిరేకంగా తాను పనిచేశానని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి. బూర నర్యయ్య గౌడ్ ఓడిపోవడం చాలా బాధకరం అన్నారు. నేను అంటే గిట్టని వాళ్లు నాపై ఈ దష్రచారం చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారం చూస్తే భాదేస్తుందని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి నన్ను కలిసిన మాట వాస్తమేనని చెప్పారు. కానీ అక్కడ మేమిద్దరం అందరి ముందే మాట్లాడుకున్నామని దాంట్లో రహస్యం ఏమి లేదన్నారు.

బొమ్మల రామరం మండలంలో ఎవరో ఇద్దరు కార్యకర్తలు మాట్లాడుకున్న మాటల్ని ఎంపీ పీఏ, ఎమ్మెల్యే మధ్య సంభాషణగా దుష్ప్రచారం చేశారు.ఇది వైరల్ చేసిన వ్యక్తని కఠినంగా శిక్షించాలని చెప్పారు. నేనెంటో భువనగిరి ప్రజలకు తెలుసన్నారు. బూర గెలుపుకోసం అందరం కష్టపడ్డాం రోడ్డు రోలర్ గుర్తు వల్లే తామే ఓడిపోయాం అని చెప్పారు. ఐదేళ్లలో నేను ఎలాంటి తప్పు చేయలేదు. నామీద ఎందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపారు.