కాళేశ్వరం.. మిడ్ మానేరుకు నీటి విడుదల..

218
- Advertisement -

తెలంగాణలో ప్రతిష్టాత్యకమై కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపుహౌస్‌లో అధికారులు ఒకేసారి ఏడు పంపులను ప్రారంభించారు. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఈ పంపుహౌస్‌లో లిఫ్ట్ అడ్వయిజర్ పెంటారెడ్డి, ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు సమష్టి కృషితో విడుదల వారీగా మోటర్లను ప్రారంభించారు.

gayatri pumphouse

మొత్తం ఏడు మోటార్లను ఏర్పాటు చేయగా అన్నింటికీ ఇప్పటికే విజయవంతంగా వెట్ ట్రయల్ రన్‌ను నిర్వహించారు. కాగా నేడు ఒకేసారి ఏడు మోటార్లను ప్రారంభించి కాళేశ్వరం జలాలను ఎత్తిపోస్తూ నీటిని మధ్యమానేరుకు తరలిస్తున్నారు. లక్ష్మీ పూర్ లోని గాయత్రి బాహుబలి 4 పంపు ల ద్వారా 12600 కుసేక్కుల నీటిని మిడ్ మానేరుకు వదిలారు అధికారులు.

- Advertisement -