కాళేశ్వరం దేవాలయాన్ని సందర్శించిన మంత్రి కొప్పుల..

107
Koppula Eshwar

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర- ముక్తేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. మంత్రి రాజగోపురం వద్దకు రాగా ఆలయ ఈవో మారుతీ, చైర్మన్ రామ్ నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించి ప్రత్యేక అభిషేకాలు చేశారు.

అనంతరం పార్వతీ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి, కల్యాణ మండపంలో అర్చకులు ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రామ్ నారాయణ గౌడ్, భూపాలపల్లి,పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ లు, జక్కు శ్రీ హర్షిని, పుట్ట మధు స్వామివారి చిత్రపటం అందజేసి మంత్రిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్లు పుట్ట మధుకర్ ,జక్కు శ్రీహర్షిని రాకేష్,పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ రఘువీర్ సింగ్ పాల్గొన్నారు.