17న అఖిలపక్ష నేతలతో వెంకయ్య భేటీ..

311
venkaiah naidu

ఎటువంటి ఆటంకాలు లేకుండా పార్లమెంట్‌లో అన్ని అంశాలు,బిల్లులపై పార్లమెంట్‌లో సజావుగా చర్చ జరిగేలా చూడాలని అన్ని పక్షాలను కోరనున్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. రాజ్యసభ 250వ సమావేశాలు కావడంతో ఈ సమావేశాలకు ఒక చారిత్రక నేపథ్యం ఉండటంతో సజావుగా జరిగేలా సహకరించాలని కొరనున్నారు.

ఢిల్లీలో ఈ నెల 17న రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిలపక్షాల నేతలతో భేటీకానున్నారు. రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకు వచ్చి 70 ఏళ్ళు, మహాత్మాగాంధీ 150 జయంతి ఉత్సవాలు కూడా రావడం చరిత్రలో మిగిలిపోయే సమావేశాలు కానున్నాయి. ఈ నేపథ్యంలోనే సభ సజావుగా సాగేలా చూడాలని చెప్పనున్నారు.