వేయి స్తంభాల గుడిలో వైభవంగా కార్తీక పౌర్ణమి పూజలు..

384
Karthika Pournami Festival In Temples

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలన్ని శివనామ స్మరణతో మార్మోగిపోతున్నాయి. తెల్లవారుజామునుండే శివాలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నయి.

వరంగల్ నగరంలోని చారిత్రక రుద్రేశ్వర వేయి స్తంభాల దేవాలయంతో పాటు శిద్దేశ్వరాలయం, కాశీబుగ్గలోని కాశీ విశ్వేశ్వరాలయం,రామ్మప్పలోని రామలింగేశ్వరాలయం,పాలకుర్తి షోమేశ్వరాలయం, కొడవటంచా లక్ష్మీనర్సింహ ఆలయాల్లో తెల్లవారుజామున నుండే మహిళలు, భక్తులు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

జిల్లాలోని పలు దేవాలయాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ, కేదారేశ్వర్ వ్రతాలు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహిస్తున్నారు.