గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్!

71
ram

ఆర్ఆర్ఆర్ తర్వాత తన 16వ సినిమాను అనౌన్స్ చేశారు రామ్ చరణ్. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా దసరా సందర్భంగా సినిమాను అనౌన్స్ చేశారు. నానితో చేసిన జెర్సీ హిట్ తో ఇటు టాలీవుడ్ ని, అటు బాలీవుడ్ ని ఎట్రాక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరితో సినిమా అనౌన్స్ చేశారు రామ్ చరణ్. యు.వి క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

ఇక స్టార్ హీరోయిన్ సమంత కూడా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. ఖైదీ, ఒకే ఒక జీవితం లాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేసిన డ్రీమ్ వారియర్ ప్రొడక్షన్స్ లో శాంతారుబన్ అనే కొత్త డైరెక్టర్ తో సినిమా సైన్ చేశారు సమంత. తమిళ్, తెలుగు బై లింగ్వల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతోంది.