బృంద వెబ్ సిరీస్‌లో త్రిష..

77
Trisha

వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనుంది త్రిష. సోనీ లివ్ డిజిటల్ రూపొందిస్తున్న బృంద సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నారు త్రిష. సోనీ లివ్ మొట్టమొదటి తెలుగు వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం

మొత్తం 8 ఎపిసోడ్స్‌గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సిరీస్ రూపొందనుండగా సాయి కుమార్, ఆమని కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూర్య వంగల ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తుండగా అవినాష్ కొల్లా నిర్మిస్తున్నారు.

శక్తి కాంత్ కార్తీక్ సంగీతం అందించనుండగా నాయకి తర్వాత ‘బృంద’ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇస్తున్న త్రిష ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.