సోనియా అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం

85
cong

ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశం జరుగుతుండగా ప్రస్తుత రాజకీయ పరిస్థితి, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, సంస్థాగత ఎన్నికలపై చర్చించనున్నారు నేతలు.

ఈ స‌మావేశంలో సీడ‌బ్ల్యూసీ స‌భ్యుల‌తో పాటు కాంగ్రెస్ ముఖ్య‌మంత్రులు పాల్గొన్నారు. తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌తో పాటు త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై చ‌ర్చించ‌నున్నారు. జీ 23 స‌భ్యుల లేఖ వ్య‌వ‌హారంపై మ‌రోసారి చ‌ర్చించే అవ‌కాశం ఉంది.

కొత్త కాంగ్రెస్ చీఫ్‌ను ఎన్నుకునే షెడ్యూల్‌పై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ జ‌రిగే స‌మావేశంలో కాంగ్రెస్ సంస్థాగ‌త ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంది.