కేంద్రం,ఎఫ్‌సీఐ తీరు విచారకరం: గంగుల

50
Gangula

రైతుల పట్ల కేంద్రం, ఎఫ్‌సీఐ తీరు విచారకరమన్నారు మంత్రి గంగుల కమలాకర్. హైదరాబాద్‌లోధాన్యం కొనుగోళ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించిన గంగుల..ధాన్యం కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించారు.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని అన్నారు. 1280 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయని వెల్లడించారు.ఎఫ్‌సీఐ తీరుతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

గతేడాదికంటే 30 శాతం అధికంగా ధాన్యం సేకరించామని చెప్పారు. ధాన్యం రైతుల డబ్బు చెల్లింపులకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఓపీఎంఎస్‌లో నమోదైన వెంటనే రైతులకు నగదు చెల్లిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రూ.5447 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు.