రైతు బాంధవుడు సీఎం కేసీఆర్- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

73
Minister indrakaran reddy
- Advertisement -

తెలంగాణ రైతులు పండించిన పంటను కొనలేమని కేంద్ర ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పిన రాష్ట్ర రైతుల పక్షాన నిలబడి ప్రతి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారని తెలంగాణ రాష్ట్ర అటవీ.న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ రూరల్ మండలంలోని వెంగ్వాపేట్ ,సారంగపూర్ మండలం ఆలూర్ గ్రామాల్లో ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం ముఖ్యమంత్రి ఎనలేని సేవచేస్తున్నారని.. రైతుల కోసం ఇందిరా పార్క్ తోపాటు డిల్లీలో ధర్నా కూడా చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం ఒక లక్ష ముప్పై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందనుకుంటే ఇప్పటికే తొంబై ఆరువేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని.. జిల్లా మొత్తంలో మూడువందలకు పైగా లారీలు ఉండగా నిర్మల్ నియోజకవర్గంలో ఒక వంద యాభై లారీల ధాన్యం ఉన్నదని తెలపారు. ఇప్పటికే నియోజకవర్గంలోని మామడ లక్ష్మణ చందా,సొన్ దిలావర్ పూర్,నర్సాపూర్. ఈ నాల్గు మండలాల్లో అక్కడక్కడా ఒకటో రెండో ఉన్నాయి తప్ప ఈ మండలాల్లో పూర్తికావస్తుందని కానీ సారంగపూర్ మండలాల్లో కొద్దిగా ధాన్యం ఉన్న వాటిని కూడా పూర్తిగా కొనుగోలు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. వర్షానికి కూడా ధాన్యం తడవకుండా లారీలను తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.

అయితే పెట్రోల్ బంక్ లు రెండు రోజులు స్ట్రైయిక్ చేస్తుండటం వల్ల లారీలు రావడం లేదని రెండు మూడు రోజుల్లోనే లారీలు రావడం జరుగుతుందన్నారు. రైతు ధాన్యం కొనుగోలు వరకు, వరి ధాన్యం తీసుకువచ్చి ఇవ్వడం వరకే వారి బాధ్యత.. అన్ని కొనుగోలు కేంద్రాల వరకు వచ్చిన ధాన్యం బాధ్యత అంతా ప్రభుత్వం దేనని మంత్రి చెప్పారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అడిషనల్ కలెక్టర్ రాంబాబును మంత్రి ఆదేశించారు. జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది.. రాష్ట్రం వచ్చి ఎనిమిది సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. ఈ ఎనిమిది సంవత్సరాల్లో సీఎం కేసీఆర్‌ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో మార్పులు తీసుకువచ్చారని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాంబాబు, జిల్లా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్ రాంరెడ్డి, ఎంపిపి రామేశ్వర్ రెడ్డి, మండల నాయకులు మాధవ రావు, రవీందర్ రెడ్డి, రాజ్ మొహమ్మద్, మాణిక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -