వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు!

22
cinema

సినీ ప్రియులకు శుభవార్త. ఇకపై ఏపీలో వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవనున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. ఈ వంద శాతం ఆక్యూపెన్సీ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి రానుంది.

కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో థియేటర్‌ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ విడుదల కానున్న మహా సముద్రంతో పాటు, దసరాకు కానుకగా విడుదలవుతోన్న మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌, పెళ్లి సందడి సినిమాలకు లబ్ధి చేకూరుతుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.