సీఎం జగన్‌కు టాలీవుడ్ థ్యాంక్స్‌

35
jagan

కరోనా కారణంగా నష్టపోయిన సినీ పరిశ్రమపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌ వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోలు సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పారు. జగన్‌ తన నిర్ణయంతో లాక్‌డౌన్‌ కారణంగా ఇండస్ట్రీలో ఏర్పడిన శూన్యాన్ని పూడ్చారని..ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వెల్లడించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయం హర్షణీయం… విపత్కర సమయంలో ఇలాంటి ఉద్దీపన చర్యలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వానికి బిగ్‌ థాంక్యూ అన్నారు ప్రిన్స్ మహేశ్ బాబు. సినీ ఇండస్ట్రీపై ఆధారపడి బతుకుతున్న ఎన్నో కుటుంబాలకు ఈ రీస్టార్ట్‌ ప్యాకేజీ ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్.

థియేటర్లు చెల్లించాల్సిన 3 నెలల ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేసింది ఏపీ సర్కార్. నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టాన్ని భరించనుందని ఏపీ సర్కార్ వెల్లడించింది.