అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం..

245
Firing against Indians in Luciana
- Advertisement -

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. లుసియానాలోని పెట్రోల్ బంకు వద్ద భారతీయులే లక్ష్యంగా గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు అమెరికన్లు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. భారతీయులు క్షేమంగా తప్పించుకున్నారు. సంఘటన స్ధలానికి చేరుకున్న  నిందితులను పట్టుకునేందుకు చర్యలను ముమ్మరం చేశారు. భారతీయులు ఎక్కువగా నివసించే ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని దాడులు చేయడంతో ఎన్నారైలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ట్రంప్ అధికారం చేపట్టాక అమెరికాలోని భారతీయులపై దాడులు జరుగుతునే ఉన్నాయి.ట్రంప్‌ కొత్త పాలసీతో భారతీయులకు అమెరికాలో రక్షణ లేకుండా పోతోంది. మత, జాతి, వివక్ష, వలస జీవులపై వ్యతిరేకతతో విద్వేష పూరిత దాడులు జరుగుతున్నాయి. ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ.. వలస జీవులు వెళ్లిపోవాలంటూ దాడులు, కాల్పులకు పాల్పడుతుండడంతో అమెరికాలో భారతీయులు భయంభయంగా గడుపుతున్నారు.

ఇక ఇదిఇలా ఉండగా ఇటీవల  కాన్సాస్‌లో చోటు చేసుకున్న జాత్యహంకార కాల్పుల్లో భారతీయ యువకుడిని కాపాడి హీరో అయ్యాడు ఓ అమెరికన్‌ పౌరుడు. కాల్పులకు కూడా భయపడకుండా దుండగుడిని కిందపడేసి బంధించే ప్రయత్నం చేశాడు. అతడి చేతులోని తుపాకీని లాక్కునే ప్రయత్నం చేశాడు. అప్పటికే అతడి తుపాకీ నుంచి తొమ్మిది బుల్లెట్లు దూసుకెళ్లాయి.

అమెరికా నేవీలో పనిచేసిన మాజీ సైనికుడు అడామ్‌ పురింటన్‌ (51) ఆస్టిన్‌ బార్‌ అండ్‌ గ్రిల్‌ లో ఇద్దరు తెలుగువారిపై కాల్పులు జరిపాడు. తమ దేశాన్ని విడిచి వెళ్లిపోండి అని గట్టిగా అరుస్తూ కాల్పులు కొనసాగించాడు. అదే సమయంలో అక్కడికి బీర్‌ తాగేందుకు వచ్చిన ఇయాన్‌ గ్రిలియట్‌(24) వెంటనే పురింటన్‌పైకి దూకాడు. అతడి తుపాకీ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడు ట్రిగర్‌ నొక్కడంతో రెండు బుల్లెట్లు గ్రిలియట్‌ శరీరంలోకి దూసుకెళ్లాయి. అయినప్పటికీ అతడిపై వీరోచితంగా పోరాడి కిందపడేశాడు గ్రిలియట్‌. గాయాల కారణంగా గ్రిలియట్‌ స్పృహకోల్పోతుండగా పారిపోయాడు పురింటన్‌. ఐదు గంటల అనంతరం పోలీసులు దుండగుడిని అరెస్టు చేశారు. స్పృహకోల్పోయిన గ్రిలియట్‌ను ఆస్పత్రికి తరలించగా అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

- Advertisement -