H1B వీసాదారులకు గుడ్ న్యూస్..

52
- Advertisement -

H1B వీసాదారులకు గుడ్ న్యూస్ అందించింది అమెరికా. ఇకపై H1B వీసా పొందిన వారు కెనడాలోనూ పనిచేయవచ్చని వెల్లడించింది. యూఎస్ హెచ్-1 బి వీసాదారులు 10వేల మంది కెనడా ఓపెన్ వర్క్ పర్మిట్ స్ట్రీమ్‌ను ప్రారంభించింది.దీంతో అమెరికాలో ఉన్న 75 శాతం భారత హెచ్-1 బి వీసాదారులకు ప్రయోజనం చేకూరనుంది.

యూఎస్ వీసాదారుల్లో ఉన్న సాంకేతిక ప్రతిభను ఆకర్షించడానికి కెనడా ఈ కొత్త పథకాన్ని ప్రారంభించింది. అత్యంత నైపుణ్యం ఉన్నవారిని ఆకర్షించడానికి కెనడా యూఎస్ నుంచి హెచ్ 1 బి వీసా హోల్డర్లకు ఓపెన్ వర్క్ పర్మిట్లను ఇవ్వడం ప్రారంభించింది. ఈ వీసా ఉన్న వారు మూడు సంవత్సరాల పాటు కెనడాలో పనిచేయనున్నారు.

భారతదేశం, చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం పదివేల మంది ఉద్యోగులను టెక్నాలజీ కంపెనీలు నియమించుకుంటున్నాయి.

Also Read:కే‌సి‌ఆర్‌ అలా చేస్తే సంచలనమే..?

- Advertisement -