కేథరిన్‌ కు అంతుందా..?

350
Catherine Tresa ,High Remuneration,Item Song,Catherine Costlier, Tollywood,CatherineTresa charged 65 lakh ,Catherine Remuneration

అందరి దారిలోనే  కేథరిన్‌ కూడా వెళ్ళింది.  కానీ కేథరిన్‌ డిఫెరెంట్‌ అనిపించుకుంటుంది. ఇంతకీ  కేథరిన్‌ ఏ దారిలో వెళ్తుంది అనుకుంటున్నారా..? అదే ఐటెం సాంగ్‌ ల దారి.   ఆఫర్లు ఉన్నా..లేకున్నా..ఐటెం సాంగ్‌లకు సై అనే హీరోయిన్లలో కేథరిన్‌ కూడా ఉందనే విషయం తెలిసిందే.

అయితే  బోయపాటి శ్రీను – బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలో కేథరీన్‌ ఐటమ్‌ సాంగ్‌ చేస్తోంది. ఈ బ్యూటీకి ఐటమ్‌ సాంగ్‌ కోసం రూ.45 లక్షలకు పైగానే చెల్లించారనే టాక్‌ సినీ వర్గాల్లో అందర్నీ షాక్‌ అయ్యేలా చేస్తోంది.
Catherine Tresa Takes High Remuneration For Item Song
అయితే ‘సరైనోడు’ సినిమాలో హీరోయిన్‌గా చేసిన ఈ బ్యూటీని లక్కీ గాళ్‌గా భావించాడు బోయపాటి శ్రీను. అందుకే తన తదుపరి సినిమా కోసం ఐటమ్‌ గర్ల్‌గా  ఈ భామని  తీసుకున్నాడట.  అయితే అంతకు ముందు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో తమన్నా రెండు సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ చేసింది. తమన్నా చేసిన ఒక్కో పాట కోసం అప్పట్లో 40 లక్షల దాకా రెమ్యూనరేషన్‌  తీసుకుందనే టాక్‌ బాగానే వినిపించింది.

ఇదిలా ఉంటే  ఇక్కడ కేథరిన్  హైలెట్‌ అవడానికి కారణం  ఈ అమ్మడి రెమ్యూనరేషనే. ఎందుకంటే..తమన్నాని మించి కేథరీన్‌కి రెమ్యునరేషన్‌ ఇవ్వడంతో ఈ అంశం గురించి ఆశ్చర్యంగా చర్చించుకుంటున్నారు టాలీవుడ్‌ జనాలు.  హీరోయిన్‌గా కూడా అంతటి రెమ్యునరేషన్‌  కేథరీన్‌కి లేదని సమాచారం.

అయితే తన సినిమాలు చాలా గ్రాండ్‌గా ఉండాలని కోరుకునే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ అలాగే, దర్శకుడు బోయపాటి.. కేథరీన్‌ రెమ్యునరేషన్‌ విషయంలో కూడా రాజీ పడకపోవడం లేదు. ఇదికాస్తా కేథరిన్‌కి బాగా  కలిసొచ్చిందనుకోవాలి. ఇంకో వైపున డాన్సుల్లోనూ స్టైలింగ్‌లోనూ కేథరీన్‌ ఇరగదీస్తుందని అంటున్నారు అభిమానులు.