- Advertisement -
భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలో నెలకొన్న పరిస్థితి పట్ల మాజీ గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాలను అభినందించారు.
సహాయ కార్యక్రమాల కోసం తన వంతు సహాయంగా తన వ్యక్తిగత సేవింగ్స్ నుండి 25 వేల రూపాయలను సి.ఎం.ఆర్.ఎఫ్ కు అందించారు. పరిస్థితి తొందరగా కుదుట పడాలని ఆకాంక్షించారు. మాజీ గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్ కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -