రవీంద్రభారతీలో ఈశ్వరీబాయి జయంతి వేడుకలు

34
tamilisai

హైదరాబాద్ రవీంద్ర భారతీ లో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దళిత సంక్షేమకర్త, అంబేద్కర్ వాదీ, సమాజ సేవకురాలు జెట్టి ఈశ్వరీ బాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ హాజరయ్యారు.

మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు రమణాచారీ, ఈశ్వరీ బాయి కుమార్తె, మాజీ మంత్రి గీతారెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ హాజరు కాగా ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ D. నాగేశ్వర రెడ్డి కి ఈశ్వరీ బాయి మెమోరియల్ అవార్డు-2021 ప్రధానం చేశారు.