పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి…

188
errabelli dayakarrao
- Advertisement -

వ‌రంగ‌ల్ ఎనుమాముల మార్కెట్ లో ప‌త్తి కొనుగోళ్ళ ను ప్రారంభించారు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….ఉమ్మ‌డి జిల్లాలో నోటిఫై చేసిన 22 జిన్నింగ్ మిల్లుల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి, ఈ రోజు నుంచి సిసిఐ ద్వారా కొనుగోలు ప్రారంభిస్తున్నం…వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాలో ప‌త్తి 7ల‌క్ష‌ల 58వేల 560 ఎక‌రాల విస్తీర్ణంలో ప‌త్తి పండిందన్నారు.

ప‌త్తి దిగుబ‌డి అంచ‌నా 6ల‌క్ష‌ల 25వేల 285 మెట్రిక్ ట‌న్నులు కాగా ఎనుమాముల మార్కెట్ కి ఎక్కువ‌గా వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా నుంచే ప‌త్తి వ‌స్తుందన్నారు. వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాలో 82వేల 842 ఎక‌రాల విస్తీర్ణంలో ప‌త్తి పండిందన్నారు. ప‌త్తి దిగుబ‌డి అంచ‌నా… 79వేల 114 మెట్రిక్ ట‌న్నులు…గ‌త ఏడాది సిసిఐ కేంద్రాలు 18 కాగా, ఈ ఏడాది 28 కేంద్రాల ద్వారా ప‌త్తి కొనుగోలు చేస్తున్నం అన్నారు.

అందుబాటులో 30 జిన్నింగ్ మిల్లులున్నాయి….ఇవేగాక‌…ధాన్యం, ప‌సుపు, మిర్చి, కంది వంటి పంట‌ల‌ను కూడా ఇక్క‌డ కొనుగోలు చేస్తారు.ఎనుమాముల‌లో 19ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బ‌స్తాల‌ను నిలువ చేసే వీలుందన్నారు. రైతు బంధు ప‌థ‌కం ద్వారా… రైతులకు వ‌డ్డీలేని రుణాలు కూడా ఇస్తున్నం అన్నారు. వ‌రంగ‌ల్ మార్కెట్ ప‌రిధిలో 24 కోల్డ్ స్టోరేజీలున్నాయి….కోల్డ్ స్టోరేజీల్లో 24ల‌క్ష‌ల 45 వేల బ‌స్తాల నిలువ చేసే సామ‌ర్థ్యం ఉంది.కోల్డ్ స్టోరేజీలో ఈ ఏడాది 22ల‌క్ష‌ల 37వేల 765 బ‌స్తాల ధాన్యాన్ని రైతులు నిలువ చేసుకున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, మేయర్ గుండా ప్రకాశ్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సదానందం, కార్పొరేటర్లు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, సిసిఐ, మార్కెట్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -