బీజేపీకి ప్రజలు ఓటుతో బుద్ది చెప్పాలి- మంత్రి హరీష్‌

41
Minister Harish Rao

మంత్రి హరీష్ రావు గురువారం దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలం ఘనపూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి డప్పు చప్పుళ్ళతో.. మంగళహారతులతో, బతుకమ్మ , బోనాలతో గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఉచిత కరెంట్ ఇచ్చారా..? అని ప్రశ్నించారు. గతంలో ఓట్ల కోసం లీడర్లు వస్తే బిందెలు పెట్టి నీటి కోసం ప్రశ్నించేవారు మహిళలు.. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడైనా ఉందా అలొంచిచాలి.

నైజం పాలన నుండి సమైక్యాంధ్ర పాలన వరకు ప్రతి ఒక్కరు భూమి ఉన్న వారి వద్ద శిస్తు వసూలు చేశారు..ఒక్క కేసీఆర్ మాత్రం చరిత్ర తిరగరాసి భూమి ఉన్న ప్రతి వారికి రైతుబంధు పథకం ద్వారా డబ్బులు ఇచ్చారు.బీజీపీ నాయకులు విదేశీ మక్కలు తెచ్చి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారు. బీజేపీ వారికి ప్రజలు ఓటు ద్వారా బుద్ది చెప్పలి. దుబ్బాక అభివృద్ధి బాధ్యత జిల్లా మంత్రిగా నాది అని మంత్రి హరీష్‌ రావు హామీ ఇచ్చారు.