బీజేపీ ఎంపీలు చేసిందేమీలేదు: ఎర్రబెల్లి

38
dayakarrao

బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి చేసిందేమీలేదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి..రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి ఉన్నా ఒక్క జాతీయ ప్రాజెక్టు తేలేదని విమర్శించారు.

మిషన్‌ భగీరథను కేంద్రం ఆదర్శంగా తీసుకుందని, అయినా నీతి ఆయోగ్‌ చిప్పినప్పటికీ భగీరథకు నిధులు ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ఇక్కడి సంక్షేమ పథకాలను కేంద్రం ఆదర్శంగా తీసుకుంటున్నదని చెప్పారు.

కిషన్‌ రెడ్డి కేంద్ర మంత్రి అయినందుకు సంతోషించినమని, తెలంగాణకు నిధులు తెస్తాడని అనుకున్నామని చెప్పారు. బండి సంజయ్‌ పిచ్చిపిచ్చిగా మాట్లాడినట్లే కిషన్‌ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడని విమర్శించారు. తెలంగాణకు గత ఏడేండ్లుగా కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చిందేమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. విభజన చట్టంలో ఉన్న కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదని విమర్శించారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం చట్టాలు చేసిందన్నారు.