అమెరికన్ల తరలింపు కష్టమే: బైడెన్

207
President Biden

ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి అమెరికా పౌరుల త‌ర‌లింపు ప్ర‌క్రియ చ‌రిత్ర‌లోనే అత్యంత క్లిష్ట‌మైన ఆప‌రేష‌న్ అన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. వైట్ హౌజ్‌ నుండి జాతినుద్దేశించి మాట్లాడిన బైడెన్….ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఉన్న ప్ర‌తి ఒక అమెరిక‌న్‌ను తీసుకువ‌స్తామ‌ని తెలిపారు.

అమెరికా వైమానిక విమానాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 13 వేల మందిని త‌ర‌లించామని…. ఆఫ్ఘ‌న్‌లో ఎంత మంది అమెరిక‌న్లు ఉన్నారో త‌మ ప్ర‌భుత్వానికి తెలియ‌ద‌న్నారు బైడెన్ . కానీ అమెరిక‌న్లు ఎవ‌రైనా స్వ‌దేశం రావాల‌నుకుంటే, వారిని క‌చ్చితంగా ఇంటికి తీసుకువ‌స్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు.

అమెరికన్ల తరలింపు అత్యంత సంక్లిష్ట‌మైన త‌ర‌లింపు అని అయితే తుది ఫ‌లితం ఎలా ఉంటుందో ఇప్పుడు ఏమీ హామీ ఇవ్వ‌లేన్నారు. తాలిబ‌న్ ఆక్ర‌మిత కాబూల్ నుంచి అమెరిక‌న్ల‌ను, ఇత‌ర విదేశీయుల‌ను త‌ర‌లించ‌డం ఓ పెను ప్ర‌మాద ఆప‌రేష‌న్‌గా మారింద‌న్నారు.