పీఎంజీఎస్‌వైని నిర్లక్ష్యం చేసిన మోదీ: మంత్రి పువ్వాడ

65
puvvada

రోడ్లు, భవనాల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే ఫలితం దక్కదని…. ఇంజినీర్లు నాణ్యతా ప్రమాణాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం జడ్పీ హాల్‌లో శనివారం పంచాయతీరాజ్‌ విభాగం ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవం కార్యక్రమాన్ని ఎంపీ నామా నాగేశ్వర్‌రావుతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పువ్వాడ..గతంతో పోలిస్తే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రోడ్ల విస్తరణకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. రోడ్లు బాగుంటేనే రవాణా సౌకర్యం మెరుగై గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గతంలో ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో గ్రాన్యులర్‌ సబ్‌ బేస్‌ టెక్నాలజీతో 426 రోడ్లు రూ.2 కోట్ల నిర్మించినట్లు చెప్పారు. అలాంటి పద్ధతులను అవలంభిస్తూ రోడ్లు వేసుకోవాలన్నారు. మోదీ ప్రధాని అయ్యాక పీఎంజీఎస్‌వైని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

జిల్లాల్లో వేయాల్సిన గ్రామీణ రోడ్లు వేల కిలోమీటర్లు ఉన్నాయని, వాటిపై కేంద్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందన్నారు. ఖమ్మానికి పూర్తిగా అన్యాయం జరిగిందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చెప్పుకుని కేంద్ర మంత్రులు పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు.