భారత్-ఇంగ్లండ్ టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం..

55
ND vs ENG

భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌ బుధవారం నుండి ప్రారంభమైంది.ఇందులో భాగంగా తొలి టెస్టు మ్యాచ్‌ నాటింగ్ హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం అవుతుంది.

భారత్ తుది జట్టు : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రిషభ్ పంత్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా

ఇంగ్లండ్ తుది జట్టు : రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లీ, జాక్ క్రాలీ, జోరూట్(కెప్టెన్), జానీ బెయిర్ స్టో , డానియెల్ లారెన్స్, జోస్ బట్లర్(కీపర్), సామ్ కరన్, ఓలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్