5 రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ సమావేశం…

22
sunil

5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది.

కరోనా బెంగాల్‌లో ఏడు నుంచి ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అలాగే కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరిలో ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మార్చి మొదటివారంలో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించే ఉంది.

బెంగాల్‌లో శాంతిభద్రత పరిస్థితులపై ఈసీ ప్రత్యేక నిఘా పెట్టింది. సమావేశానికి సవివరమైన నివేదికలతో రావాలని అధికారులను ఆదేశించింది. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ (పశ్చిమ బెంగాల్ ఇన్‌చార్జి) సుదీప్ జైన్ బెంగాల్‌ ఈసీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.