బీజేపీ నేతపై లైవ్‌లో చెప్పు దెబ్బ.. !

34
vishnu

ఓ ఛానల్‌ వేదికగా బీజేపీ నేత విష్ణువర్థన్‌పై చెప్పుతో దాడి చేశారు ఏపీ పరిరక్షణ సమితి నేత కొలికలపూడి శ్రీనివాస్. ఏపీ మున్సిపల్ ఎన్నికలు, కేబినెట్ నిర్ణయాలు సహా పలు ఏపీ అంశాలపై చర్చ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి, కొలికలపూడి శ్రీనివాస్‌తో పాటు మరికొందరు పాల్గొన్నారు. చర్చ సందర్భంగా విష్ణు, శ్రీనివాస్ మధ్య మాటల యుద్ధం జరిగింది.

శ్రీనివాస్‌ను విష్ణువర్దన్ రెడ్డి పెయిడ్ ఆర్టిస్ట్ అని అనడంతో.. ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ విష్ణుపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన చెప్పు తీసి విష్ణువర్ధన్ రెడ్డిపై దాడి చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాల్ వైరల్‌గా మారింది.

సమన్వయం పాటించే వ్యక్తులనే ఇలాంటి కార్యక్రమాలకు పిలవాలని …మ మీద తమకు కంట్రోల్ లేని వ్యక్తులను చర్చా వేదికలకు ఆహ్వానించకూడదని సోషల్ మీడియా వేదికగా పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.