ఎర్రబెల్లి బర్త్ డే…మొక్కలు నాటాలని పిలుపు

36
errabelli dayakarrao

ఈ నెల 4న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బర్త్ డే వేడుకలు నిరాడంబరంగా జరగనున్నాయి. ఇక తన బర్త్ డే సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు, టీఆర్ఎస్ సైనికులకు విన్నపం చేశారు మంత్రి ఎర్రబెల్లి.

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపించి ఉన్న నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నానని తెలిపారు ఎర్రబెల్లి. అదే విధంగా నియోజకవర్గంలోని ప్రజలు, కార్యకర్తలు, నా మిత్రులు, శ్రేయోభిలాషులు, తదితరులు నా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని కోరుతున్నానని తెలిపారు.

ముఖ్యంగా ఎవరు కేక్ లు కట్ చేయడం కానీ, సామూహిక వేడుకలను నిర్వహించడం కానీ చేయవద్దు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ కరోనా వైరస్ ను కట్టడి చేద్దాం.ప్రతి ఒక్కరం చెట్లు నాటుదాం – హరిత తెలంగాణలో భాగస్వామ్యులు అవుదాం అని పిలుపునిచ్చారు.