వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వేటు పడనుందా…?సీఎం జగన్….రఘురామకు షాక్ ఇవ్వనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో స్పీకర్ ఓం బిర్లాతో సమావేశం కానున్నారు వైసీపీ ఎంపీలు.
విజయసాయిరెడ్డి నేతృత్వంలో లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి, ఎంపీలు నందిగం సురేష్, శ్రీకృష్ణదేవరాయలు తదితరులు స్పీకర్‌తో భేటీకానున్నారు.రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్నారు.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో.. ఆయనను అనర్హునిగా ప్రకటించాలని కోరనున్నారు.
కొంతకాలంగా సీఎం జగన్,వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు ఎంపీ రఘురామ. ఇటీవలె షోకాజ్ నోటీస్ జారీ చేసిన ఆయన తన పొంతనలేని సమాధానాలతో అగ్నికి మరింత ఆజ్యం పోశారు.తనకు వైసీపీ నేతల నుండి ప్రాణహాని ఉందని కేంద్ర హోంశాఖకు లేఖ రాయడంతో మరింత సీరియస్ అయిన వైసీపీ అధిష్టానం…ఆయనపై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

