వాట్సాప్‌..అదిరిపోయే ఫీచర్స్!

222
whatsapp
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్ మరో 5 కొత్త ఫీచర్స్‌ని తీసుకొచ్చింది

వెబ్​ వాట్సాప్​కు డార్క్ మోడ్​, క్వాలిటీ వీడియో కాల్స్​, కైఓఎస్​కు మాయమైపోయే స్టేటస్​, యానిమేటెడ్​ స్టిక్కర్స్, క్యూఆర్​ కోడ్స్ లను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని సంస్థ ప్రకటించింది.

వెబ్​ వాట్సాప్​కు డార్క్ మోడ్ ఇప్పటివరకు ఆండ్రాయిడ్, ఐఓఎస్ లకు మాత్రమే డార్క్ మోడ్ అందుబాటులో ఉండగా ఇప్పుడు వెబ్ వర్షన్ కు కూడా అందుబాటులోకి రానుంది. వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ పై నొక్కితే ఆ భాగంలో క్లారిటీ ఎక్కువ వచ్చేలా రూపొందిస్తున్నారు. దీంతో పాటు క్యూ ఆర్ కోడ్ ద్వారా వ్యక్తి కాంటాక్ట్ ను స్కాన్ చేసి, సేవ్ చేసుకునే సదుపాయం రానుంది.

- Advertisement -