KTR:రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

29
- Advertisement -

 మంత్రి కేటీఆర్ దుబాయ్ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. అగ్నిమాపక సామాగ్రి తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన యూఏఈ దిగ్గజ సంస్థ NAFFCO కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రూ. 700 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకొచ్చింది.

ఈ సందర్భంగా కంపెనీ సీఈవో ఖాలిద్ అల్ ఖతిబ్ ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్ సమావేశమైంది. తెలంగాణ రాష్ట్రంలో తమ అగ్నిమాపక సామాగ్రిని తయారు చేయ‌నున్న‌ట్లు సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా రూ. 700 కోట్ల భారీ పెట్టుబడిని పెడుతున్నట్లు తెలిపింది.

అలాగే తెలంగాణలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్ర‌క్ష‌న్‌తో కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న మంత్రి కేటీఆర్ ప్రతిపాదనకు కంపెనీ అంగీకారం తెలిపింది. ఈ ట్రైనింగ్ అకాడమీ ద్వారా దాదాపు 100కు పైగా దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ నైపుణ్యాన్ని, అగ్నిమాపక శిక్షణను తెలంగాణ కేంద్రంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సంస్థ సీఈవో వెల్లడించారు.

Also Read:పాలలో బెల్లం కలిపి తాగుతున్నారా!

- Advertisement -