పాలలో బెల్లం కలిపి తాగుతున్నారా!

57
- Advertisement -

మన శరీరానికి కావలసిన పౌష్టికమైన ఆహార పదార్థాలలో పాలు మొదటి స్థానంలో ఉంటాయి. చిన్నపిల్లలకు, బలహీనులకు ప్రతిరోజూ పాలు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. శరీరానికి అత్యంత త్వరగా శక్తిని అందించడంనూ, కండరాలను పుష్టిగా తయారు చేయడంలోనూ, ఎముకల పటుత్వాన్ని పెంచడంలోనూ పాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. అందుకే ప్రతిరోజూ కనీసం ఒక్క గ్లాసు పాలు తాగాలని నిపుణులు చెబుతుంటారు. సాధారణంగా పాలను మరింగించి అందులో చక్కెర లేదా ప్రోటీన్ పౌడర్ వంటివి కలుపుకుని తాగుతుంటారు చాలమంది. కానీ పాలలో బెల్లం కలుపుకుని తాగే వారు చాలా తక్కువ..

అయితే పాలలో బెల్లం కలుపుకుని తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో అదనపు ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. పాలలో చక్కెరకు బదులుగా బెల్లం కలుపుకుని తాగితే జీర్ణక్రియ మెరుగుపడి అజీర్తి, గ్యాస్, కడుపులో మంట, మలబద్దకం వంటి సమస్యలను దూరం అవుతాయట. ఎవరికైనా ఆస్తమా, సైనన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో భాదపడుతున్న వారు ప్రతిరోజూ ఉదయం వేడి వేడి ఒక గ్లాసు పాలలో బెల్లం వేసుకొని తాగితే ఆస్తమా నుంచి తొందరగా విముక్తి లబిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

బెల్లం లో గ్లూకోజ్, సుక్రోజ్, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. అందువల్ల పాలలో చక్కెరకు బదులు బెల్లం కలిపి తాగితే స్థూలకాయం బారిన పడకుండా ఉండొచ్చని పలు అద్యయానాలు చెబుతున్నాయి. ఇక మహిళలు పిరియడ్స్ టైమ్ లో వచ్చే నొప్పిని తట్టుకునేందుకు పాలలో బెల్లం కలిపి తాగితే మేలని నిపుణులు చెబుతున్నారు. రక్తాన్ని శుద్ది చేయడంలో బెల్లం ప్రముఖ పాత్ర వహిస్తుంది. అందువల్ల పాలలో బెల్లం కలిపి తాగితే రక్త నాళాల పని తీరు మెరుగుపడడంతో పాటు అన్నీ శరీర భాగాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుందట. కాబట్టి పాలలో పంచదార కు బదులు బెల్లం కలిపి తాగితే పై ప్రయోజనలన్నీ కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read:కాలీఫ్లవర్.. వీళ్ళు తింటే ప్రమాదమే?

- Advertisement -