రేవంత్ రెడ్డిని నమ్మితే ముంచినట్లే..?

31
- Advertisement -

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అధిష్టానం నమ్మడం లేదా ? ఆయనను నమ్మితే నిలువునా మునగదం ఖాయమని అధిష్టానం భావిస్తోందా ? ఇంతకీ రేవంత్ రెడ్డి విషయంలో అధిష్టానం వైఖరి ఎలా ఉంది ? ఈ ప్రఃశ్నలు ప్రస్తుతం తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలకు కారణం అవుతున్నాయి. ఈ రకమైన ప్రశ్నలు తెరపైకి రావడానికి కూడా కారణం లేకపోలేదు. సాధారణంగా ఒక రాష్ట్రలో ఏదైనా పార్టీకి అధ్యక్ష హోదాలో ఉన్నవారికి ఆ పార్టీకి సంబంధించి సర్వ హక్కులు ఉండడం సాధారణం. పార్టీ వ్యూహరచనలోనూ పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడంలోనూ అధ్యక్షుడిదే కీలక పాత్ర. కానీ టి కాంగ్రెస్ విషయంలో మాత్రం ఈ విధానం పూర్తి గా భిన్నంగా కనిపిస్తోంది.పేరుకు టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్నప్పటికి.. పార్టీకి సంబధించి అన్నీ వ్యవహారాలు కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కనుసైగల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. .

ఈ మద్య తరచూ టీ కాంగ్రెస్ నేతలు డీకే శివకుమార్ తో భేటీ అవుతున్నారు. ఒకే పార్టీకి చెందిన వారు కదా అందులో తప్పేముంది అనుకుంటే పొరపాటే. డీకే తో టచ్ లో ఉండాలని ఆయన సలహాలు సూచనలు తీసుకోవాలని హస్తం హైకమాండే టీ కాంగ్రెస్ నేతలకు సూచిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక్కడే అసలు సమస్య ఎందుకంటే టీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని అధిష్టానం నమ్మడం లేదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఒకవేళ నమ్మితే వేరే రాష్ట్ర అధ్యక్షుడితో పనేముంది అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి. అయితే కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడానికి డీకే పాత్ర చాలా ఉందని ఆ పార్టీ అధిష్టానం నమ్ముతోంది.

అందుకే టీ కాంగ్రెస్ బాద్యతను కూడా డీకే భుజలపైనే వేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా రేవంత్ రెడ్డి వైఖరిపై కూడా అధిష్టానం సందేహిస్తునట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయన టీడీపీలో ఉన్నారు పైగా తనకు రాజకీయ గురువు చంద్రబాబు అని రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పుకొచ్చారు కూడా. దీంతో అటు ఆంధ్రలో చంద్రబాబు బీజేపీతో దోస్తీ కోసం వెంపర్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇన్ఫ్లూయెన్స్ రేవంత్ రెడ్డిపై ఉండే అవకాశం ఉందనేది అధిష్టానం మదిలో మెదులుతోందట. రేవంత్ రెడ్డికి ఆర్ ఎస్ ఎస్ నేపథ్యం కూడా ఉంది. అందువల్ల ఆయనను నమ్మితే ముప్పే అని అధిష్టానం భావిస్తోందట. అందుకే టీ కాంగ్రెస్ వ్యవహారాల్లోనూ డీకే శివకుమారే కీలకంగా వ్యవహరించేలా అధిష్టానం ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తాజా పరిస్థితులు చూస్తుంటే హస్తం హైకమాండ్ రేవంత్ రెడ్డిని నమ్మడం లేదనేది స్పష్టమౌతోంది.

Also Read:పాలలో బెల్లం కలిపి తాగుతున్నారా!

- Advertisement -