సౌ’భాగ్యనగరం’… అ’భాగ్యనగరం’గా: కేటీఆర్

14
- Advertisement -

పదేళ్ల కేసీఆర్ పాలనలో సౌ’భాగ్యనగరం’.. 15 నెలల అసమర్థ కాంగ్రెస్ పాలనలో అ’భాగ్యనగరం’గా మారిందన్నారు మాజీమంత్రి కేటీఆర్. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో హైదరాబాద్‌లో ఇండ్ల కొనుగోళ్లు తగ్గగా పేదల ఇండ్ల పైకి బుల్డోజర్లు, పెద్దల ఆస్తులతో సెటిల్మెంట్లు జరుగుతున్నాయన్నారు.

రియల్ ఢమాల్.. ఇన్ఫ్రా సజీవ సమాధి అయిందన్నారు. మూసీ, హైడ్రా పేరుతో మూటలు కడుతున్న కాంగ్రెస్ గద్దలు.. అమ్మకాలు జరగక ఆందోళనలో రియల్టర్లు అన్నదాతలే కాదు అమాయక రియల్ వ్యాపారులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు.

హైదరాబాద్‌లో గత త్రైమాసికంలో 49 శాతం తగ్గిన ఇళ్ల విక్రయాలు తగ్గగా ఆఫీస్ లీజింగ్ కూడా అధః పాతాళానికి… 2025 జనవరి – మార్చి మధ్య 41 శాతం తగ్గుదల నమోదయిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ దూరదృష్టి లేని, అసమర్థ విధానాలే ఈ పతనానికి కారణం.. కూల్చడం కాదు … కట్టడం నేర్చుకోండి , అబద్దాలు చెప్పడం కాదు అభివృద్ధి చేయడం నేర్చుకోండి అన్నారు.

Also Read:అప్పులపై రేవంత్ చెప్పినవన్నీ తప్పులే: కవిత

- Advertisement -