ఎవరినీ వదలం..మత్తు వదిలిస్తాం

225
Drug Case Officer Suddenly Cancel on Leave
- Advertisement -

టాలీవుడ్ లో నెలకొన్న డ్రగ్స్ కల్చర్ పై ఉక్కుపాదం మోపిన ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తన 10 రోజుల వ్యక్తిగత సెలవును రద్దు చేసుకున్నారు. డ్రగ్స్ విచారణ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో, అకున్ సబర్వాల్ సెలవుపై వెళుతుండటంపై నలు వైపుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, ఆయన వెనక్కి తగ్గారు. తన సెలవులపై వదంతులు వస్తున్న నేపథ్యంలోనే సెలవులు రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కేసు విచారణను పూర్తి చేయాల్సి ఉందన్నారు. కేసు విచారణలో ఎవరి పేర్లు అయినా బయటకు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్‌తో ప్రమేయం ఉన్నవారందరినీ విచారిస్తామని స్పష్టం చేశారు. 67 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చామని తెలిపారు. విచారణ అనంతరం డ్రగ్స్‌తో ప్రమేయం ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విచారణకు పోలీసుల సహకారం తీసుకుని.. వీలైనంత తర్వగా ఈ కేసును పూర్తి చేస్తామన్నారు సబర్వాల్.

మత్తులో అమాయకుల ప్రాణాలను ఫణంగా పెట్టే ముఠాను వదిలిపెట్టే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ రాకెట్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని … హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న డ్రగ్స్ ముఠా ఆటలు కట్టించేందుకు కఠినచర్యలు తీసుకుంటామని, ఎవరి ఒత్తిడికీ భయపడేది లేదని, కేసులో ఎంతపెద్దవాళ్లనైనా ఉపేక్షించేది లేదని చెప్పారు.

హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ సరఫరా అవుతున్న విషయమై ఎైక్సెజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రత్యేక నిఘా పెట్టిందని తెలిపారు. 30 రోజులుగా కూపీ లాగుతూ, రాకెట్ మూలాలను ఛేదించే ప్రయత్నాలు ముమ్మరం చేశాం. ఇప్పటివరకు ముఠాలోని 13 మందిని అరెస్టులు చేశాం. వారి మొబైల్ కాల్‌డాటా ప్రకారం కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించాం. హైదరాబాద్‌లోని ప్రముఖులకు అందించిన డ్రగ్స్ వివరాలపై పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

ఇప్పటివరకు సినిమారంగానికి చెందిన 12 మందికి నోటీసులు జారీచేశామని…. 19 నుంచి విచారణ ప్రారంభమవుతుంది. నోటీసులు అందుకున్నవారంతా రోజుకొక్కరు చొప్పున విచారణకు ఎైక్సెజ్ సిట్ ముందు హాజరుకావాలని తెలియజేశాం. వారిదగ్గరున్న సమాచారం, సిట్ వద్ద ఉన్న సమాచారంతో విచారణ సాగుతుంది. నోటీసులు అందుకున్నవారి స్టేట్‌మెంట్‌ను రికార్డుచేసి, విచారించాక కేసును ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.

- Advertisement -