బైకుల్లా జైలు నుంచి బయటికొచ్చిన రియా..

100
Rhea Chakraborty

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్‌ రియా చక్రవర్తికి ఇవాళ ముంబై హైకోర్టు బెయిల్‌ను మంజూరీ చేసింది. అయితే ఇదే కేసులో అరెస్ట్ అయినా ఆమె సోదరుడు సౌవిక్ చక్రవర్తికి మాత్రం బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో నటి రియా చక్రవర్తిను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆమె ముంబయిలోని బైకుల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పటికే అనేక పర్యాయాలు రియా బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురికాగా, తాజాగా బాంబే హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో నెలరోజుల తర్వాత ఆమె బాహ్యప్రపంచంలోకి వచ్చినట్టయింది.

డ్రగ్ కేసులో సెప్టెంబర్ 8వ తేదీన రియాను అరెస్టు చేశారు అధికారులు. ఆమె వాట్సాప్ మెసేజ్‌ల ఆధారంగా ఎన్సీబీ ఆమెను అరెస్టు చేసింది. సుశాంత్ మృతి వెనుక డ్రగ్స్ కోణం ఉందన్న నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కూడా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో రియా చక్రవర్తిని పలుమార్లు విచారణకు పిలిపించిన ఎన్సీబీ అధికారులు ఆపై ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కాగా, ఈ కేసులో ఎన్సీబీ అధికారులు రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి సహా మరో 13 మందిని కూడా అరెస్ట్ చేశారు.