గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న అనాథ చిన్నారులు..

271
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తల్లిదండ్రులు లేని అనాథ చిన్నారులతో మొక్కలు నాటించిన డాక్టర్ మార్కండేయులు.అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రతి ఒక్కరూ పాటించాలని చిన్నారులతో ప్రమాణం చేయించారు.

ఈ సందర్బంగా డాక్టర్ మార్కండేయులు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక అద్భుతమైన కార్యక్రమని , ఈ కార్యక్రమం ఇప్పుడు దేశంలో ప్రముఖలందరు బాగస్వామ్యులవుతున్నారన్నారని తెలిపారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ యొక్క ఉద్దేశాన్ని చిన్నారులకు తెలియజేసేసేందుకే…నాగోల్ లోని అనాథ చిన్నారుల ఆశ్రమంలో మొక్కలు నాటడం జరిగిందన్నారు.

నేను గత 15ఏళ్లకు పైగా మొక్కలు నాటే అలవాటు ఉండేదని…ఇన్ని సంవత్సరాలలో ఇలాంటి కార్యక్రమం చూడలేదన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మనకు తెలిసిన వాళ్లు , మనం అభిమానించే వాళ్ళు మొక్కలు నాటే విధంగా కోరడం , ఒకరి ద్వారా ఒకరికి గ్రీన్ ఛాలెంజ్ కొనసాగడం , మొక్కలు నాటడం పైన , పర్యావరణ పరిరక్షణ పైన మంచి అవగాహనా కల్పిస్తున్నా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు . ఇంతటి అద్భుతమైన కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

- Advertisement -