కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌తో మంత్రి కేటీఆర్ భేటీ..

209
ktr
- Advertisement -

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో భేటి అయ్యారు మంత్రి కేటీఆర్.తెలంగాణాలో పట్టణాభివృద్ధి శాఖ, విమానయాన శాఖకు సంబంధించిన అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర అధికారులకు రాష్ట్ర పనులను త్వరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రి ఆదేశాలిచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ నూతన పురపాలక చట్టం అంశాలను కేంద్ర మంత్రికి వివరించామని తెలిపారు.ఆక్టోబర్ లో మరోసారి పూర్తి నివేదికతో రావాలని కేంద్ర మంత్రి సూచించారు.

స్వచ్ఛ భారత్ నిధులు, అమృత్ పథకం నిధులు,15 వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ 784 కోట్లు విడుదల చేయాలని కేంద్రమంత్రిని కోరాం అన్నారు.రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంకోసం ఇవ్వవలసిన 1, 184 కోట్లు విడుదల చేయాలని కోరాం…..మొత్తంగా పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన 2537.81 లక్షలను మంజూరు చేయాలని కోరాం అన్నారు.

వరంగల్ లో మమునూరు ఎయిర్ పోర్టును ఉడాన్ పథకంలో చేర్చాలని కోరాం.…త్వరలో కేంద్ర బృందం పంపుతామని కేంద్ర మంత్రి తెలిపారు.త్వరలో వరంగల్ ప్రజలకు విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నాం…మిగతా 5 చోట్ల కూడా సర్వేలు జరుగుతున్నాయని చెప్పారు. వరంగల్ కు రన్ వే ఉంది కాబట్టి ముందుగా వరంగల్ కు విమాన సేవలు అందించాలని కేంద్రమంత్రిని కోరాం అన్నారు.

- Advertisement -