నవంబర్‌లో కరోనా వ్యాక్సిన్ :ట్రంప్

234
trump

నవంబర్‌ 1 నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. అక్టోబర్‌ నుండి అమెరికా దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.

అత్యంత రక్షణ, సమర్ధవంతమైన విధానంలో వ్యాక్సిన్‌ సరఫరా చేయనున్నామని ఈ ఏడాది చివరి వరకు 10 కోట్ల డోస్‌లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఇందుకు సంబంధించిన డేట్‌,విధివిధానాలు వెల్లడిస్తామన్నారు.

కరోనా టీకాపై వ్యతిరేక ప్రచారాన్ని డెమొక్రాట్లు మానుకోవాలని సూచించారు ట్రంప్‌. వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారాన్ని ఆపివేయమని బిడెన్‌కు కోరుతున్నానని తెలిపారు.