జూరాల 24 గేట్లు ఎత్తివేత

149
Jurala water

ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరదనీరు పెరిగి. ఇప్పటికే జురాల ప్రాజెక్టు డ్యామ్ పూర్తిస్ధాయిలో నిండుకుండను తలపిస్తుండటంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి ప్రస్తుతం 1.88లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1,044 అడుగులు.

ఇక పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులు కాగా డ్యామ్‌లో నీటి నిల్వ 9.111 టీఎంసీలు.. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. 24 గేట్లు ఎత్తివేసి, 2,02,425 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.